• ఏసీ నగర్‌లోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్‌కు మహర్దశ పట్టనుంది. పాఠశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిగ్మా కంపెనీ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.9.69 కోట్లతో పాఠశాలను ఆధునికీకరించేందుకు ముందుకొచ్చింది.
  • ఈ ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. తన కుమార్తె షరణితో కలిసి పనులను ప్రారంభించారు. పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

2028 చివరి నాటికి పనులు పూర్తి

  • ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ పనులను 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
  • పేద విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
  • విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పేద పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *