నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 150 తీర్మానాలకు ఆమోదం!

Date:

నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 150 అజెండా తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలకు అజెండాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు మేయర్ తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తీర్మానాల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో, కార్పొరేటర్ల సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మేయర్ సుజాత అన్నారు.

కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ. నందన్, అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో నగర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తామని ఆమె తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కో-ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...