క్రెడిట్ చోరీకి పాల్పడాల్సిన అవసరం మాకు లేదు: పల్లా శ్రీనివాసరావు

Date:

భోగాపురంలో అల్లూరి అంతర్జాతీయ విమానశ్రయం రేపు(గురువారం) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభంకానుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని. అంతర్జాతీయ విమానాశ్రయం వలన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తాయని అన్నారు. ఎయిర్‌పోర్టు‌ని అడ్డుకొని కోర్టులో కేసులు వేసిన వారే ఇది తమ ఘనత అని. క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు విజినరీ గల నేత అని.. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా అన్ని పనులు పూర్తి చేసి. ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎర్ర బస్సు రాని చోట. ఎయిర్‌పోర్టు ఎందుకని జగన్ అన్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలోనే ఎయిర్‌పోర్టును పూర్తిచేసినట్లు చెప్పారు. జగన్‌ రెడ్డి ఒక భ్రమలో ఉన్నారన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు, డేటా సెంటర్, పోలవరం ఇలా తాము చేసినవి ఆయన చేశానని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. క్రెడిట్ చోరీకి పాల్పడవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీడీపీ హయంలోనే ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగిందని. రేపు ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఏం చేశారో చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...