వేదికపైనే తండ్రికి పాదాభివందనం.. సంస్కారంతో లోకేశ్ సైలెంట్ పీఆర్.. సాలిడ్ ఇంపాక్ట్..!

Date:

రంపచోడవరంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తన తల్లి కాళ్లు మొక్కుతున్న సమయంలో మంత్రి నారా లోకేశ్ సైతం పక్కనే ఉన్న తన తండ్రి చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. స్టేజీపైనే లోకేశ్ తన తండ్రికి పాదాభివందనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన మాటల్లో తడబాటు కనిపించేది. దీంతో ఆయన్ను ప్రత్యర్థులు విపరీతంగా ట్రోలింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు అదే లోకేశ్ తన ప్రత్యర్థులకు సైతం కొత్త పాఠాలు చెబుతున్నారు. సుదీర్ఘ ఉపన్యాసాలు, భారీ ప్రకటనల అవసరం లేకుండా.. చిన్న చిన్న సంఘటనలతోనే ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం వేళ పవన్ కళ్యాణ్‌ కాళ్లు మొక్కడం మొదలుకొని.. నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో తన తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేయడం వరకు.. లోకేశ్ సందర్భోచితంగా వ్యవహరిస్తున్న తీరు ఆయన సంస్కారానికి, సమయస్ఫూర్తికి అద్దం పడుతోంది.

శుక్రవారం రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్‌లో వేదికపైనే నారా లోకేశ్ తన తండ్రి చంద్రబాబు నాయుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది కావాలని చేసినట్టుగా కాకుండా.. విద్యార్థులు తమ తల్లుల పాదాలకు వందనం చేసి ఆశీర్వాదం తీసుకోవాలని అనౌన్స్‌మెంట్ వచ్చిన సమయంలో.. లోకేశ్ కూడా తన పక్కనే ఉన్న చంద్రబాబు కాళ్లకు మొక్కారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...