
శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయనకు అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానానికి ఆయన అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి పరిటాల శ్రీరామ్ జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఎన్నికల బరిలోకి దిగుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
