నందికొట్కూరు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికారులు, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల రోల్ అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్ హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా శనివారం 136 నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అందిన దరఖాస్తులను రోల్ అబ్జర్వర్ క్షుణ్ణంగా పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటరు జాబితా సవరణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్న ప్రశాంతి, బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఈఆర్‌ఓ, ఆత్మకూరు ఆర్డీఓ సి. వెంకట శివ, ఏఈఆర్‌ఓలు బి. శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయక్, శివరాముడు, పగిడ్యాల శ్రీనివాసులు, సుభద్ర, పాములపాడు ఉమారాణితో పాటు ఎన్నికల సిబ్బంది, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *