ప్రగతి నివేదిక కాదది.. గతి తప్పిన నివేదిక : వైఎస్‌ షర్మిల

Date:

అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు( Chandra Babu ) ఘనపాటి అని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ట్విటర్‌లో అభివర్ణించారు. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక అని ఆరోపించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం, అభివృద్ధి బూటకం, సంపద సృష్టి మోసం, సమతుల్యత పచ్చి అబద్ధం, సంక్షేమం టోకరా అని పేర్కొన్నారు.

విధ్వంసం నుంచి అగాధంవైపు, అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు కూటమి పాలన కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యమని ఆరోపించారు. భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారని విమర్శించారు.

3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ కి రూ.4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లిందని ఆరోపించారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లని ప్రశ్నించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...