వైజాగ్‌లో మారథాన్.. గెలిస్తే రూ. 12 లక్షల బహుమతి

Date:

వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంధ్యా మెరైన్స్ వైజాగ్ మారథాన్ ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 29వ తేదీన 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు రూ. 12 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మారథాన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని.. మురికవాడల్లో వారు కూడా పాల్గొంటేనే, మట్టిలో మాణిక్యాలు బయటకు తీయొచ్చని వారు చెబుతున్నారు.

ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించేందుకు చాలా మంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కూడా మారథన్ నిర్వహించేందుకు తలపెట్టింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు మారథాన్ నిర్వహించిన సొసైటీ ఇప్పుడు ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. సంధ్యా మెరైన్ వైజాగ్ మారథాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిజిస్ట్రేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నవంబర్ 29వ తేదీన మారథాన్ జరుగుతుందని వైజాగ్ రన్నర్స్ సొసైటీ పేర్కొంది. మొత్తం నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం కొందరికే కాకుండా ఈ మారథాన్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో ప్రజలు కూడా మారథాన్‌లో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇలా చేస్తేనే మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారని చెప్పారు.

ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని మారథాన్ నిర్వాహకులు చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి మారథాన్‌లు ఏర్పాటు చేస్తే ప్రాక్టీస్ కోసమైనా వ్యాయామం చేస్తారని, అది అలవాటుగా మారిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కనీసం రోజులో ఒక గంటపాటు అయినా శరీరానికి వ్యాయామం అవసరమని చెబుతున్నారు. పోటీలు నిర్వహించి ప్రైజ్‌మని ప్రకటిస్తే వీటిపై అవగాహన పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్‌మనీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు రూ. 12 లక్షల నగదు బహుమతులు అందించినున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంధ్యా మెరైన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కొర్రగుంట, అపోలో హాస్పిటల్స్ ఆరిలోవ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ రవిచందర్ కట్టా, శ్రీకన్యా ఐరన్ అండ్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీనివాస్ దుద్దుపూడి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...