IND vs SA 2nd Test : గెలవడానికి కాదు కాపాడుకోవడానికి ఆడుతున్నాం టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విరాట్ అన్న ఫైర్..

Date:

  • సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమి అంచున ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ పరోక్షంగా జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మొదటి టెస్ట్‌ను 30 పరుగుల తేడాతో ఓడిన భారత్.
  • గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ విజయం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో టీమ్ మేనేజ్‌మెంట్‌లో చేసిన అనవసర మార్పులే ఈ వైఫల్యానికి కారణమని వికాస్ కోహ్లీ తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.
  • వికాస్ కోహ్లీ తన థ్రెడ్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన నేరుగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కోచ్, ప్రస్తుత మేనేజ్‌మెంట్ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. “ఒకప్పుడు విదేశీ పిచ్‌లపై కూడా గెలవడానికి ఆడేవాళ్ళం.
  • ఇప్పుడు మన దేశంలో కూడా మ్యాచ్ కాపాడుకోవడానికి ఆడుతున్నాం. బాగున్న సిస్టమ్‌లో అనవసరంగా పెత్తనం చేసి, మార్పులు చేస్తే ఇలాగే జరుగుతుంది” అని వికాస్ కోహ్లీ ఆ పోస్ట్‌లో ఘాటుగా రాశారు.
  • ప్రస్తుత టీమిండియా మేనేజ్‌మెంట్‌లో కోచ్‌గా గౌతమ్ గంభీర్తో పాటు, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్, టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నారు. కోచ్ గంభీర్ సారథ్యంలో భారత టెస్ట్ ప్రదర్శన క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆయన పదవీకాలంలో జట్టు గెలుపు కంటే ఓటములనే ఎక్కువగా నమోదు చేసింది. ముఖ్యంగా సొంతగడ్డపై కూడా టీమిండియా కష్టపడటం ఆందోళన కలిగిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...