పశ్చిమ ప్రకాశంలో ఎండిపోతున్న తోటలు.. నిమ్మసాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్!

Date:

మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో నిమ్మసాగు ఎక్కువగా ఉంది. మార్కాపురం, కనిగిరి, వైపాలెం, గిద్దలూరు, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో 4 వేల హెక్టార్లలో సాగుచేస్తుండగా.. కేవలం కనిగిరి ప్రాంతంలోనే 2 వేల హెక్టార్లు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం నిమ్మసాగుపై చూయించింది. ఆగస్టు రెండో వారం వస్తున్నా ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడకపోతే నిమ్మ చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది పశ్చిమ ప్రకాశమే.. ప్రస్తుత మార్కాపురం జిల్లా. వ్యవసాయం మినహా మరేయితర పరిశ్రమలు లేని ఏకైక జిల్లా మార్కాపురం. వ్యవసాయం కూడా కేవలం వర్షాల మీద మాత్రమే ఆధారపడాలి. వర్షాలు పడితేనే ఇక్కడ ప్రజలకు పంటలైనా, నీళ్లైనా.. ఏదైనా వర్షమే ఆధారం. ఎలాంటి పంట కాల్వలు లేని జిల్లా కూడా మార్కాపురమే! గతేడాది మొంథా తుఫాను పుణ్యమా అంట వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండి నీటికి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ, ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం గడుస్తున్నా కనీసం చినుకు కూడా లేదు. ఈ ఎల్‌నినో ప్రభావం రైతులపై ఎక్కువగా పడింది.

మార్కాపురం జిల్లాలో బోరు కింద పండించే పంటలు కంటే వర్షాల మీద ఆధారపడి పండేంచేవే ఎక్కువ. హార్టికల్చర్ కింద మాత్రం కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో నిమ్మ సాగు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు ఆ నిమ్మ సాగు కూడా ప్రమాదంలో పడింది. ఈ ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు నిమ్మకాయలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. రోజుకు కొన్ని వందల బస్తాలను రైతులు ఎగుమతి చేస్తుంటారు.

గతేడాది మొంథా తుఫాను తర్వాత చెప్పుకోదగ్గ వర్షాలు ఇప్పటి వరకు నమోదుకాలేదు. ఎండలు ఎక్కువగా నమోదు కావడం, వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. దాంతో కనిగిరి వ్యవసాయ సబ్ డివిజిన్ పరిధిలోని నిమ్మ తోటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...