తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఆ ఎయిర్‌ పోర్టు నిర్మాణాలపై కీలక ప్రకటన!

Date:

తెలంగాణ వాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాలు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

తెలంగాణను ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.. వరంగల్ (మామునూరు),ఆదిలాబాద్ విమానాశ్రయం పనులను వేగవంతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్, రన్‌వే పనులకు టెండర్లు సిద్ధమవ్వగా.. మరో 3-4 వారాల్లో టెర్మినల్ భవనం నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో 253 ఎకరాల భూమిని అప్పగించడాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. తన హయంలోనే తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణం పూర్తవుతుందన్నారు.

మరోవైపు ఆదిలాబాద్‌ విమానాశ్రయాన్ని డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. దీని కోసం సుమారు 1,500 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రక్షణ శాఖ నుంచి అనుమతులు వచ్చిన తరువాత ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులు వేగవంతం అవుతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రూ. 30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిపోర్టులు నిర్మిస్తున్నారు. రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారు. అందులో భాగంగా తెలంగాణను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒకలా ఎన్డీఏలో లేని రాష్ట్రాలను ఒకలా చూడటం లేదని, దేశ అభివృద్ధి లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు

భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో రూ. 30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్‌పోర్టులు, 200 హెలిపోర్టులు నిర్మిస్తున్నారు. రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారు. అందులో భాగంగా తెలంగాణను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను ఒకలా ఎన్డీఏలో లేని రాష్ట్రాలను ఒకలా చూడటం లేదని, దేశ అభివృద్ధి లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...