నెల్లూరు జిల్లాలో దారుణంగా చోటు చేసుకుంది. బావకు కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలుకు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

నెల్లూరు జిల్లాలో దారుణంగా చోటు చేసుకుంది. బావకు కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలుకు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. హరికృష్ణ బావ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరిని కారులో తీసుకెళ్లి కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి చంపి, గుండెపోటుతో మరణించాడని అందరిని నమ్మించి, ఆస్తి కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు అతనిపై శ్రీహరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హరికృష్ణ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఇలా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

