తొలి మ్యాచ్ సెంటిమెంట్ బ్రేక్… 14 ఏళ్ల తర్వాత ముంబై గెలుపు

Date:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌కు ముంబై ఇండియన్స్ తెరదించింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఓడిపోవడం అనే సంప్రదాయాన్ని ఈసారి ముగించింది. 2013 నుంచి 2025 వరకు ముంబై జట్టు ప్రతి సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో పరాజయం చవిచూస్తూ వచ్చింది. అయితే ఐపీఎల్ 2026లో కేకేఆర్‌పై విజయం సాధించి ఆ చెడు రికార్డును చెరిపేసింది.

ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026ను గెలుపుతో ప్రారంభించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌లో ముంబై చివరిసారిగా 2012లో తొలి మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2025 వరకు వరుసగా 13 సీజన్లలో ఓటములు చవిచూసింది. కానీ ఈసారి కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఆ చెత్త రికార్డుకు ముగింపు పలికింది.

ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిచినా, ముంబై ఇండియన్స్‌కు మొదటి మ్యాచ్ మాత్రం ఎప్పుడూ కష్టంగా మారేది. 2012 నుంచి ఆ జట్టు ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. దీంతో అభిమానులు ‘మొదటి మ్యాచ్ దేవుడికి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించేవారు. అయితే తర్వాత ముంబై జట్టు పుంజుకుని టైటిల్ గెలవడం లేదా ప్లే ఆఫ్స్ చేరడం సాధారణమైంది. కానీ ఈసారి మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపింది. కేకేఆర్ ఇచ్చిన 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించి అదిరిపోయే ప్రదర్శన చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...