బ్యాడ్ లక్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్.. అనిల్ రావిపూడి మేజిక్‌తో దశ మారుతుందా?

Date:

టాలీవుడ్ సక్సెస్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకోవడం ఆయన ప్రత్యేకత. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించాయి. మధ్యస్థాయి హీరోలతో ప్రారంభించి స్టార్ హీరోల వరకు పని చేస్తూ వరుస విజయాలు అందుకున్నారు.

గత సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్, ఈసారి కూడా ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి వెంకటేష్ తో కలిసి పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

దర్శకుడిగా మారిన తర్వాత కళ్యాణ్ రామ్‌తో చేసిన పటాస్ సినిమాతోనే అనిల్ రావిపూడి మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటించే అవకాశముందని, దాదాపు ఫైనల్ అయిందని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో కళ్యాణ్ రామ్ సరసన ఒక యంగ్ హీరోయిన్‌ను తీసుకోవాలని అనిల్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ “బ్యాడ్ లక్ బ్యూటీ”కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు, యువ నటి కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి, ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ పెద్ద విజయాలు మాత్రం సాధించలేకపోయింది. చేసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని మాత్రమే విజయాలు అందుకున్న ఈ భామ, తర్వాత చేసిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో సెకండ్ హీరోయిన్‌గా కృతి శెట్టి నటించే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, అనిల్ రావిపూడి సినిమాతో కృతికి మంచి బ్రేక్ దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...