రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

Date:

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి చూడగా.. లోపల కనిపించిన దృశ్యం ఆమెను కలవరపెట్టింది. వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరిలోని పోలీస్ స్టేషన్ కు బ్యాగ్ తో సహా పరుగులు తీసింది. ఇంతకీ బ్యాగ్ లోపల ఏముందాని అనుకుంటున్నారా?

 ఉచితంగా వచ్చేది పినాయిల్‌ అయినా గుటుక్కుమనిపించే.. నేటి కాలంలో ఓ మహిళ చూపిన నిజాయతీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రోడ్డుపై ఎవరో పొరబాటున చేజార్చుకున్న బంగారం, డబ్బు ఉన్న బ్యాగును చూసి దుర్భుద్దితో ఆమె దాచేయలేదు. వెంటనే పోలీసులకు అప్పగించి దానిని పోగొట్టుకున్న యజమానికి చేరేలా చేసింది. ఈ అరుదైన ఘటన అనకాపల్లి జిల్లా తునిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శరభవరం గ్రామానికి చెందిన గోరంట్ల దేవి తన వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను ఇచ్చి కొత్త నగలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇంట్లో ఉన్న పాత బంగారు నగలు, నగదును ఒక బ్యాగులో సర్దుకుని శుక్రవారం ఉదయం తునికి బయల్దేరింది. తుని మెయిన్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న బ్యాగు అనుకోకుండా చేజారి పోయింది. కొంతసేపటి తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో గోరంట్ల దేవి తీవ్ర ఆందోళనకు గురైంది. బంగారం, నగదు ఉన్న బ్యాగు ఎక్కడ పోయిందో తెలుసుకునేందుకు వచ్చిన మార్గం మొత్తం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇదే సమయంలో రోడ్డుపై పడి ఉన్న ఆ బ్యాగును ఏడేలమ్మ అనే మహిళ కంట పడింది. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని యజమానికి చేరేలా చేయాలని భావించిన ఏడేలమ్మ.. వెంటనే బ్యాగుతో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...