విజయ్ ‘జన నాయకుడు’ తొలి స్పందన.. అంచనాలు అందుకోలేకపోయిందా?

Date:

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొనగా, ఓవర్సీస్ ప్రీమియర్స్ మరియు తొలి షోల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.

బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే బలహీనమైన కథనం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్‌గా మారాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకున్నప్పటికీ, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, విజయ్ మాస్ ఇమేజ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన ‘జన నాయకుడు’ కథ, దర్శకత్వం పరంగా మాత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని తొలి టాక్ వినిపిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...