గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు DPR సిద్ధం.. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం!

Date:

మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం, మ్యూజియం, ‘లండన్ ఐ’ తరహాలో చరఖా ఆకారంలో రంగుల రాట్నం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అలాగే మూసీ నదిపై 15 వంతెనలు, సైక్లింగ్ ట్రాక్‌లు, బోటింగ్ సదుపాయం, పర్యాటక హంగులతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు.

హైదరాబాద్ నగర మధ్యగా ప్రవహించే మూసీ నదిని అందంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మురుగు, వ్యర్థాలతో కలుషితమై ప్రవహిస్తున్న మూసీని ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను తాజాగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRLDCL) సిద్ధం చేసింది. బాపూఘాట్ ప్రాంతంలో 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే మూసీ నదికి రెండు వైపులా విశాలమైన రోడ్లు, నది వెంట ఆకర్షణీయమైన పార్కులు అభివృద్ధి చేయనున్నారు.

బాపూఘాట్ ప్రాంతంలో ప్రభుత్వానికి సుమారు 60 ఎకరాల భూమి ఉంది. ఇందులో 34 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. 100 మీటర్ల ఎత్తు వరకు పలు అంతస్తులతో టవర్ నిర్మించి, అందులో సమావేశ మందిరాలు, మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను ప్రతిబింబించే ప్రదర్శనశాల, కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టవర్ పైభాగంలో 35 నుంచి 50 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

అదే విధంగా గాంధీ విగ్రహం వెనుక భాగంలో లండన్ థేమ్స్ నది తీరాన ఉన్న ‘లండన్ ఐ’ తరహాలో రంగుల రాట్నం నిర్మించనున్నారు. గాంధీ స్మృతులను గుర్తు చేసే చరఖా ఆకారంలో ఈ నిర్మాణం ఉండేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు విస్తరణ కోసం పక్కనున్న 98 ఎకరాల రక్షణ శాఖ భూములను సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

మూసీ నదిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నది పరివాహక ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 15 వంతెనలను నిర్మించనున్నారు. ఒక వైపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు, మరోవైపు 80 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా కాలిబాటలు, సైక్లింగ్ ట్రాక్‌లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

నదిలో పేరుకుపోయిన పూడికను తొలగించి, అంచులను సరిచేసి కొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు. పిల్లల పార్కులు, హోటళ్లు, వేడుకలు నిర్వహించుకునేలా యాంఫీ థియేటర్లు కూడా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కానున్నాయి. మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో చిన్న ఆనకట్టలను కూడా నిర్మించనున్నారు. గాంధీ సరోవర్‌లో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...