భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు

Date:

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే భారత్, చైనా సహా తమ ప్రధాన ట్రేడ్ పార్ట్‌నర్స్‌పై ఎలాగైనా సుంకాలు వసూలు చేయాలని చూస్తున్న ట్రంప్.. మరో కొత్త ఆయుధం తెరపైకి తీసుకొచ్చారు. అదే సెక్షన్ 301. దీని గురించి చూద్దాం.

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ దేశంపై ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో తెలియట్లేదు. అప్పటికప్పుడు బాగానే ఉన్నట్లు కనిపించినా.. మరు క్షణమే అదే దేశంపై చర్యలు తీసుకున్న ఘటనలు కూడా చూశాం. ఇందులో భాగంగానే తాను గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాల్ని విధిస్తున్నారు. మెక్సికో, కెనడా, చైనా, భారత్ వంటి దేశాలపై రికార్డు స్థాయిలోనూ పెంచారు. ఈ క్రమంలోనే. అయినా తగ్గని ట్రంప్.. తమ ప్రధాన వాణిజ్య భాగస్వాములపై ఎలాగైనా టారిఫ్స్ వసూలు చేయాలని చూస్తున్నారు. దీని కోసం కొత్త దారులు వెతకుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సెక్షన్- 301 అనే ఆయుధాన్ని బయటకు తీశారు.

ఈ సెక్షన్ 301 .. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యూఎస్ ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద.. యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేసియా, ఇండోనేసియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయ్‌లాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరగనున్నట్లు గ్రీర్ పేర్కొన్నారు. అయితే ఈ లిస్టులో కెనడా మాత్రం లేదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...