
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మూవీకి అద్భుతమైన సాహిత్యం అందిస్తున్న ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను ఆశీర్వదిస్తున్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఈ పిక్ నాని అభిమానులను ఆకట్టుకుంటోంది.
సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?
ఫొటోతో పాటు ‘ది పారడైజ్’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోని రెండో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే వచ్చిన తొలి సింగిల్ మంచి జోష్‌ను తీసుకురాగా.. ఇప్పుడు సెకండ్ సింగిల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ మరోసారి తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘ది పారడైజ్’ సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ సింగిల్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

