
బంగారం మళ్లీ భగ్గుమంది.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల, వెండి కూడా పరుగులు
గత రెండు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల్లో ఎంత మేర తగ్గాయో, దాదాపు అంతే స్థాయిలో నేడు ఒక్కరోజులోనే పెరగడంతో పసిడి ప్రియులు నిరాశకు గురయ్యారు. ఈరోజు తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.3,770 పెరగగా, కిలో వెండి ధర రూ.5,000 ఎగబాకింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.14,455గా నమోదైంది. 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.13,250గా, 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) బంగారం గ్రాము ధర రూ.10,841గా ఉంది.
అదే విధంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500 వద్ద ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,50,000కు చేరుకోగా, ఢిల్లీలో కిలో వెండి ధర కూడా రూ.5,000 పెరిగి రూ.2,45,000 వద్ద విక్రయమవుతోంది.

