
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి లాభాలతో ముగిశాయి. అమెరికా కొత్త టారిఫ్ ప్రకటన నేపథ్యంలో రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు.. చివరికి కొనుగోళ్ల మద్దతుతో వరుసగా రెండో రోజు కూడా లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.
84,328 వద్ద సెన్సెక్స్ ముగింపు
బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 390.31 పాయింట్లు పెరిగి 84,328.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65.25 పాయింట్లు లాభపడి 25,884.50 వద్ద ముగిసింది. అమెరికా టారిఫ్ నిర్ణయాలపై నెలకొన్న ఆందోళనల మధ్య కూడా కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి.
ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
సెన్సెక్స్ 30లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
రూపాయి, ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.92.44గా నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 94.13 డాలర్ల వద్ద కొనసాగింది. అటు బంగారం ధర ఔన్సుకు 3,561 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.



