
మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’పై మెగా అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ‘బింబిసార’తో దర్శకుడిగా తన సత్తా చాటిన వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. భారీ స్థాయిలో జరుగుతున్న గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఒక దశలో ‘విశ్వంభర’ అసలు విడుదల అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
రిలీజ్ డేట్పై మారుతున్న అంచనాలు
గతంలో ‘విశ్వంభర’ను 2026 నవంబర్లో విడుదల చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2027 సంక్రాంతి బరిలోకి తీసుకురావచ్చనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్కు సంబంధించి మరో ఆసక్తికరమైన టాక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 2027 మార్చిలో వచ్చే మహాశివరాత్రి సందర్భంగా ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాంటసీ కథతో పాటు దైవిక అంశాలు కూడా ఉన్న నేపథ్యంలో మహాశివరాత్రి సీజన్ సినిమాకు కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్.
‘కాకా’ తర్వాత విశ్వంభర?
చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’పై దృష్టి పెట్టారు. ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత ‘విశ్వంభర’ను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మార్చి మహాశివరాత్రి రిలీజ్ అనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మాత్రమే. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ విజువల్స్, ఫ్యాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘విశ్వంభర’కు ఫైనల్గా ఏ రిలీజ్ డేట్ ఖరారవుతుందో చూడాలి.
