వీకెండ్‌లో హైదరాబాద్‌ నుంచి తక్కువ ఖర్చుతో చిన్న ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కువ రోజులు సెలవులు అవసరం లేకుండానే కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్లి రావడానికి నగరానికి సమీపంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలు, ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఇవి మంచి ఎంపికలు. బడ్జెట్‌లోనే వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ప్రదేశాలను పరిశీలించవచ్చు.

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో చాలా మందికి కాలు నిలవదు. కొందరు సినిమాలకు వెళ్తే, మరికొందరు షాపింగ్‌తో బిజీ అవుతారు. ఇంకొందరు వీకెండ్‌ను ఎంజాయ్ చేసేందుకు టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కువ ఖర్చు లేకుండా హైదరాబాద్‌లోనే సరదాగా ఓ రోజు గడపాలనుకుంటున్నారా? అలాంటి వారికి నగరంలోనే ఉన్న ఈ బెస్ట్ ప్రదేశాలు మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి. తక్కువ బడ్జెట్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చుట్టొచ్చే ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో చాలామందికి కాలు నిలవదు. సినిమాలు చూసేవాళ్లు సినిమాలకు, షాపింగ్‌ ఇష్టపడేవాళ్లు షాపింగ్‌కు వెళ్తుంటారు. ఇక వీకెండ్‌ టూర్‌ ప్లాన్ చేసుకునేవాళ్లు కూడా ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరుతారు. అయితే ఎక్కువ ఖర్చు లేకుండానే హైదరాబాద్‌ నుంచి వెళ్లి సరదాగా చుట్టొచ్చే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలు మంచి ఎంపికలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొండల మధ్య ప్రశాంతంగా కొంతసేపు గడపాలనుకునే వారికి ఇది మంచి గమ్యస్థానం. ఇక్కడికి వెళ్లే రహదారి కూడా సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ముఖ్యంగా పచ్చని అడవుల మధ్య డ్రైవింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారికి అనంతగిరి కొండల ప్రయాణం మంచి అనుభూతిని అందిస్తుంది.

రోజంతా బిజీగా గడిపిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా సేదతీరాలనుకునేవారికి ఈ ప్రదేశం మంచి ఎంపిక. ఇక్కడి లోయలు, జలపాతాలు కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, కోటపల్లి సరస్సులో కయాకింగ్‌ వంటి వాటర్‌ అడ్వెంచర్‌ కార్యకలాపాల్లో కూడా పాల్గొని ఆహ్లాదంగా గడపొచ్చు.

హైదరాబాద్‌ నుంచి సుమారు 212 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రం. కుటుంబంతో కలిసి విహారయాత్రలా ఇక్కడికి వెళ్లొచ్చు. ముఖ్యంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి శ్రీశైలం అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సోయగాలు కూడా ఆకట్టుకుంటాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఎన్నో పురాతన దేవాలయాలు శ్రీశైలంలో ఉన్నాయి. కుటుంబంతో వెళ్లినప్పుడు ఈ ఆలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.

ఇక్కడి ప్రత్యేకతలు కేవలం ప్రకృతి అందాలకే పరిమితం కావు. ఈ పుణ్యక్షేత్రానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. రోప్‌వే ద్వారా గంగను వీక్షించడంతో పాటు, పడవ ప్రయాణం చేస్తూ మహాదేవి గుహలను సందర్శించవచ్చు. అంతేకాదు, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ను కూడా సందర్శించి, అడవిలో సంచరించే వివిధ రకాల వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.