
తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పందించారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో అదనపు ఆదాయం కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేస్తున్న యువతపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పార్ట్‌టైమ్ రైడర్ల ఉపాధికి ఇబ్బందులు కలగకుండా బైక్ ట్యాక్సీలకు పసుపు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళా రైడర్లకు భద్రతతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం లేకపోవడంతో అదనపు సంపాదన కోసం ఓలా, ర్యాపిడో, బ్లింకిట్, స్విగ్గీ వంటి సంస్థల్లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్న యువత ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు.
బైక్ ట్యాక్సీలకు పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై పార్ట్‌టైమ్ రైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. సాధారణ నంబర్ ప్లేట్లతో బైక్ ట్యాక్సీలు నడిపే అవకాశం లేకుండా పసుపు నంబర్ ప్లేట్ తప్పనిసరి చేస్తే వేలాది మంది రైడర్ల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె పేర్కొన్నారు.
పార్ట్‌టైమ్ రైడర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే మహిళా రైడర్లకు భద్రతతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కోరారు.
తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కుటుంబాలను నడిపించేందుకు ఎంతోమంది రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అనేక మంది యువతీ యువకులు కూడా తమ చదువుతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతోమంది యువకులు, యువతులు డెలివరీ బాయ్స్, డెలివరీ గర్ల్స్‌గా పనిచేస్తూ తమ సొంత బైక్‌లపై తిరుగుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
అలాంటి వారి జీవనోపాధిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. సొంత బైక్‌లతో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న వారందరికీ ఎల్లో బోర్డులు తప్పనిసరి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఎంతోమంది ఆడబిడ్డలు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు తమ సొంత బైక్‌లపై పార్ట్‌టైమ్ పనులు చేస్తున్నారు. వారికి ఎల్లో బోర్డు నిబంధన తప్పనిసరి చేస్తే, ట్యాక్సీ బైక్‌లుగా వాహనాలను నడపడం వారికి సాధ్యంకాని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వారి ఉపాధి దెబ్బతిని, కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
