
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బన్నీని ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్, క్యారెక్టరైజేషన్లో చూపించేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్లో కనిపించనున్నారనే టాక్ కూడా ఇప్పటికే వైరల్‌గా మారింది.
రెండు భాగాలుగా ‘రాకా’?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ‘రాకా’ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. కథ భారీగా ఉండటంతో పాటు, పూర్తి కథను ఒకే సినిమాలో చెప్పడం కష్టమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘రాకా’ పార్ట్-1ను 2027లో, రెండో భాగాన్ని 2028లో విడుదల చేసే ఆలోచనలో సన్ పిక్చర్స్ ఉన్నట్లు టాక్. రిలీజ్ డేట్స్‌పై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అట్లీ ఏమన్నాడంటే..
రెండు భాగాలుగా సినిమా వస్తుందన్న ప్రచారంపై ఇటీవల అట్లీని కోలీవుడ్ మీడియా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన దర్శకుడు.. ఈ విషయంపై తన నిర్మాతలే తనను ఇంకా ప్రశ్నించలేదంటూ సమాధానం దాటవేశారట. త్వరలోనే దీనిపై అధికారికంగా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. ‘రాకా’ను ఆస్కార్ స్థాయిలో నిలిచేలా తెరకెక్కించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అట్లీ చెప్పినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ
ఇక ‘రాకా’ కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ సుమారు రూ.175 కోట్లు కాగా.. అట్లీ దాదాపు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. కథకు అనుగుణంగా మరో నలుగురు హీరోయిన్లు కూడా బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ నడుస్తోంది. అయితే వీరి పాత్రలు, పూర్తి కాస్టింగ్‌పై మేకర్స్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
‘పుష్ప’ను రెండు భాగాలుగా తీసుకొచ్చిన అల్లు అర్జున్‌కు సీక్వెల్ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. ఇప్పుడు ‘రాకా’ కూడా రెండు భాగాలుగా వస్తే.. బన్నీ కెరీర్లో మరో భారీ ఫ్రాంచైజీగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
