• గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గురువారం పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి రూ.75 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
  • గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని అనిత విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ద్వారా తాను కూడా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందానని గుర్తుచేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోంమంత్రి తెలిపారు.
  • ఇందులో భాగంగా ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. తమ పిల్లలు గంజాయికి బానిసలయ్యారని పలువురు తల్లులు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, బాధితుల కోసం రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
  • మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అనిత అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భద్రత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *