తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు విలువైన ఆభరణాలను విరాళంగా సమర్పించారు. శనివారం జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు స్వామివారికి బంగారు లాకెట్, ముత్యాలహారాన్ని కానుకగా అందజేశారు.
వీటిలో వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్ విలువ రూ.44.35 లక్షలు కాగా, వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల ముత్యాలహారం విలువ రూ.7.20 లక్షలుగా ఉంది.
ఈ రెండు ఆభరణాల మొత్తం విలువ రూ.51.55 లక్షలు. శ్రీవారిపై భక్తితో ఆర్తి బిందాల్ దంపతులు ఈ విలువైన ఆభరణాలను విరాళంగా సమర్పించారు.