
కడప నూతన డీఎస్పీగా టీ. భవాని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను ఉన్నతాధికారులు కడపకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన భవాని హిందూపురంలో ప్రాథమిక విద్య, తిరుపతి విద్యానికేతన్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె, అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. 2018లో గ్రూప్-2కు ఎంపికై చాపాడులో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు.
2023 ఆగస్టులో గ్రూప్-1 ద్వారా డీఎస్పీ సివిల్ పోస్టుకు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయ్యాక 2026 ఏప్రిల్‌లో కాశీబుగ్గ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కడపకు బదిలీ కావడంతో నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
