• విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం

  • మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • ఒక చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట ధరించి అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సమస్త మానవాళికి అన్నపానీయాలను అందించే తల్లిగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారని పండితులు తెలిపారు. సాక్షాత్తూ పరమేశ్వరుడికే అన్నం పెట్టిన దేవతగా అమ్మవారికి విశిష్టత ఉందని వివరించారు. అన్నపూర్ణాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ధనధాన్యాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *