ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 22 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను ప్రకటించారు. ఇందులో మచిలీపట్నం కార్పొరేషన్‌కు షేక్ అబ్దుల్ అబీదా, నర్సీపట్నానికి చింతకాయల పద్మావతిని ఖరారు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. స్థానిక నాయకులతో పాటు కీలక నేతల కుటుంబ సభ్యులకు కూడా అవకాశం దక్కింది. నర్సీపట్నం అభ్యర్థిగా ప్రకటించిన చింతకాయల పద్మావతి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి.

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా (22 మంది వివరాలు)

1. మచిలీపట్నం కార్పొరేషన్.. షేక్ అబ్దుల్ అబిదా

2. నర్సీపట్నం.. చింతకాయల పద్మావతి (స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి)

3. చీరాల – హనీ స్పందన

4. డోన్ – కోట్ల సుజాతమ్మ

5. ప్రొద్దుటూరు – నంద్యాల రాఘవరెడ్డి

6. కదిరి – షేక్ సమీరా

7. కళ్యాణదుర్గం – బుట్న లక్ష్మి

8. గుత్తి – గోవిందరాజులు తమిళ్ సెల్వి

9. గుంతకల్లు – యశోద

10. ఆకివీడు – నిలోఫర్ షేక్

11. బేతంచెర్ల – ఐ. లోకేష్ గౌడ్

12. బుచ్చిరెడ్డిపాలెం – దొడ్ల విజయలక్ష్మి

13. జంగారెడ్డిగూడెం – రొంగల అనూష

14. కొండపల్లి – కన్నెకంటి అమూల్య

15. కొవ్వూరు – జొన్నలగడ్డ రాధారాణి

16. నాయుడుపేట – షకీరా

17. నందిగామ – శాకమూరి వంశీధర్

18. నందికొట్కూరు – E.M. సబురున్నీసా

19. వెంకటగిరి – దొంతు శారద

20. ఉయ్యూరు – చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్

21. ఏలేశ్వరం – యార్లగడ్డ అక్షిత

22. ఎమ్మిగనూరు – మాచాని సునీత

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *