రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు పెంచాలని సీఎంకు అనిరుధ్ రెడ్డి లేఖ.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

Date:

ఇప్ప పువ్వు గురించి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను పెంచాలని.. సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్ప చెట్ల పెంపకానికి సంబంధించి.. 52 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ 52 మందిలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. దీంతో మరోసారి రాష్ట్రంలో ఇప్ప పువ్వు వ్యవహారం చర్చకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. ఏకంగా 52 మంది ఎమ్మెల్యేలు.. అనిరుధ్ రెడ్డి చేస్తున్న డిమాండ్‌కు మద్దతుగా సంతకాలు చేయడం గమనార్హం.

ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పేర్కొంటున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల ఈ క్రమంలోనే ఇప్ప పువ్వు చెట్ల ఉద్యమాన్ని చెపట్టారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ డిమాండ్‌కు ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...