
తిరుమల, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు భక్తులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ముగ్గురు దాతలు అన్నప్రసాదం, ప్రాణదాన ట్రస్టులకు కలిపి రూ.63,00,116 విరాళంగా అందించారు.
ఒంగోలుకు చెందిన గడ్డం వేణుగోపాల్ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. గురువారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
అలాగే, గూడూరుకు చెందిన పుట్టి వెంకటేశ్వర్లు అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33,00,116 విరాళంగా అందించారు. ఆయన తరఫున ప్రతినిధి మోహన్కుమార్రెడ్డి విరాళం డీడీని అధికారులకు అందజేశారు.
మరోవైపు, హైదరాబాద్కు చెందిన పి. వీరేంద్రబాబు వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
భక్తులు అందించిన ఈ విరాళాలు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద వితరణ, ప్రాణదాన సేవా కార్యక్రమాలకు తోడ్పడనున్నాయి.
