ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలను ఆదేశించారు.

నామినేషన్ల స్వీకరణ గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుందని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారంటూ ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిశీలించాలని పునేఠా సూచించారు. ఫిర్యాదుదారులను ఫోన్‌లో సంప్రదించి, గడువులోగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ విధంగా సమర్పించే నామినేషన్లను స్వీకరించేలా రిటర్నింగ్‌ అధికారులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. అలాగే నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లే సమయంలో అవసరమైన చోట్ల అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేలా తగిన వాతావరణాన్ని కల్పించాలని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *