Andhra Weather: హమ్మయ్య ఏపీకి కూల్ న్యూస్.. ఒక్కసారిగా మారిపోనున్న వాతావరణం.

Date:

రాయలసీమ, పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం, మంగళవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఆయా రోజుల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల క్రింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు.

మరోవైపు సోమవారం(30-03-26) విజయనగరంజిల్లా బాడంగి,మెరకముడిదాం,తెర్లాం,వంగర మండలాలు.. పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం మండలాలు.. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆదివారం మార్కాపురం(జి)లో 13 ప్రాంతాల్లో, కడపలో 12, తిరుపతి 11, నెల్లూరు11, చిత్తూరులో 8 ప్రాంతాల్లో మిగతా చోట్ల కలిపి మొత్తం 78 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయిందని పేర్కొన్నారు.

ఆదివారం నెల్లూరు(జి) గూడూరు 42.4°C, మార్కాపురం(జి) నందనమారెల్ల 42.3°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 42.1°C, కడప(జి) పొట్టిపాడు 41.9°C, తిరుపతి(జి) నాగలాపురం, చిత్తూరు(జి) సింధురాజపురం 41.7°C, విజయనగరం(జి) రాజాం 41.2°C, పల్నాడు(జి) నూజెండ్ల, ప్రకాశం(జి) కొండపి, నంద్యాల(U) 40.8°C, తూర్పుగోదావరి(జి) చిట్యాల 40.4°C, కర్నూలు(జి)తోవి 40.2°C, శ్రీకాకుళం(జి) కొల్లువలసలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...