ఇరాన్ యుద్ధం వేళ పెంటగాన్‌లో ప్రకంపనలు.. పీట్ హెగ్సెత్ డిమాండ్‌తో అమెరికా ఆర్మీ చీఫ్ రాజీనామా

Date:

ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అగ్రరాజ్య సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ తన పదవి నుంచి తక్షణమే వైదొలిగారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశాలతో జరిగిన ఈ మార్పు పెంటగాన్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం ఆర్మీ చీఫ్‌నే కాకుండా.. ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్‌ను పక్కన పెట్టిన హెగ్సెత్.. రక్షణ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

ఇరాన్‌తో యుద్ధం తీవ్రం అవుతున్న వేళ అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆదేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తనదైన శైలిలో సాయుధ దళాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్‌ను పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ ఆదేశించగా.. ఆయన తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.

పదాతిదళ అధికారిగా కెరియర్ ప్రారంభించిన ర్యాండీ జార్జ్.. ప్రఖ్యాత వెస్ట్‌పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టా పొందారు. ఆపై అమెరికా సైన్యంలో విశేష సేవలు అందించారు. గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, అఫ్గానిస్థాన్‌ యుద్ధంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభనం ఆయనకు ఉంది. గతంలో లాయిడ్ ఆస్టిన్ సహాయకుడిగా పని చేసిన ఆయన.. గతేడాది జరిగిన ఉన్నత స్థాయి అధికారుల తొలగింపుల నుంచి బయటపడగలిగారు. అయితే ప్రస్తుత రక్షణ మంత్రి హెగ్సెత్ చేపట్టిన మిలిటరీ ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు ఆయన కూడా పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ర్యాండీ అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. అమెరికా సైన్యం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

    రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

    ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

    విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

    మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

    టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

    రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...