ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. సోమవారం పంచాయతీరాజ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

తీర ప్రాంతాలు లోతట్టు గ్రామాలు, మత్స్యకార ఆవాసాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు తన పరిధిలోని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విపత్తు నిర్వహణలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.






By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *