ఆర్నబ్ తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి బలమైన గాలులు వీయగా, మంగళవారం ఉదయం నుంచి పలు మండలాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

నాగావళి, వంశధార నదులకు సంబంధించి జలాశయాలకు రాబోయే ఐదు రోజుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో వరద ప్రవాహం గరిష్ఠ స్థాయికి చేరవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *