ఇరాన్ ఉన్నత సైనికాధికారులు మృతి.. స్వయంగా ప్రకటించిన ట్రంప్.. వీడియో విడుదల!

Date:

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌పై జరిగిన ఒక భారీ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్‌లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దానితో పాటు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి రాత్రి ఆకాశంలో ఒక పెద్ద పేలుడు, మంటలు కనిపిస్తున్నాయి.

ఆ ప్రాంతంలో యుద్ధం తీవ్రమవుతూ, పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా, హోర్ముజ్ జలసంధిని తెరవకపోయినా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రంప్. ఇదిలావుంటే, డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ప్రపంచ చమురులో 20 శాతం దిగుమతి అయ్యే సముద్ర మార్గమే ఈ హోర్ముజ్ జలసంధి. దీనిని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు కొరతకు దారితీసింది.

ఇదిలా ఉండగా, యుద్ధంలో తొలిసారిగా ఇరాన్‌లో ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశారు. ఒక పైలట్‌ను రక్షించారు, మరొకరు గల్లంతయ్యారు. శత్రు భూభాగంలో అత్యంత సాహసోపేతమైన ‘మిషన్ ఇంపాజిబుల్’ ఆపరేషన్‌ చేపట్టిన తప్పిపోయిన అధికారిని సురక్షితంగా కాపాడారు. మరోవైపు అమెరికా ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయమని కోరారు. దీని వెనుక గల కారణాలను బహిరంగపరచనప్పటికీ, యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి, విమర్శల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...