
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో 17చోట్ల ప్రతిపాదించగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో రెండుచోట్ల కూడా కావాలని కోరడంతో ఆ రెండు కలిపి 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు డీపీఆర్ సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించగా.. త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ అమరావతి ORRకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 17 ఇంటర్ ఛేంజ్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు ఇంటర్ ఛేంజ్‌లు కావాలని కోరడంతో అనుమతించారు.. దీంతో మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్‌లు అయ్యాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి, గుంటూరు, విజయవాడల చుట్టూ ప్లాన్ చేశారు.. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో 190 కిలోమీటర్లు ఉంటుంది.
అమరావతి ORR కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ కావడంతో వాహనాలు ఎంటర్ (ప్రవేశించేందుకు) అయ్యేందుకు, ఎగ్జిట్ (బయటకు వచ్చేందుకు) అయ్యేందుకు అవకాశం ఉండదు. అందుకే 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు క్రాస్ చేసే దగ్గర ఇంటర్‌ఛేంజ్‌లు ప్రతిపాదించారు. కోల్‌కతా-చెన్నై నేషనల్ హైవే 16తో పాటుగా మచిలీపట్నం-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని రెండచోట్ల క్రాస్ చేసేలా ప్లాన్ చేశారు. ఇలా మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి.

