తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

Date:

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు సంబంధించి 13,95,43,231 లడ్డూలను విక్రయించారు. 2025-2026 (ఏడాదిలో)లో అదనంగా 1.76 కోట్ల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. ఈ లడ్డూ విక్రయాల ద్వారా రూ.567 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది టీటీడీ ప్రస్తుతం రోజుకు 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాలను తీసుకుంటారు. గత ఏడాది కాలంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు భారీగా పెరిగాయి. 2025-2026 వార్షిక ఏడాదిలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. 2024-2025 విషయానికి వస్తే 12,18,53,535 లడ్డూలను అమ్మారు. 2024-2025తో పోలిస్తే.. 2025-2026 (ఏడాదిలో) అదనంగా 1.76 కోట్ల లడ్డూలను విక్రయించారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది.. శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా కావాలనుకునే వారికి రూ. 50కి ఒకటి చొప్పున లడ్డూ అందిస్తోంది. 2025-2026 వార్షిక ఏడాదిలో లడ్డూల విక్రయాల ద్వారా రూ. 567 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...