అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

Date:

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో 17చోట్ల ప్రతిపాదించగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో రెండుచోట్ల కూడా కావాలని కోరడంతో ఆ రెండు కలిపి 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు డీపీఆర్ సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించగా.. త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ అమరావతి ORRకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 17 ఇంటర్‌ ఛేంజ్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు ఇంటర్ ఛేంజ్‌లు కావాలని కోరడంతో అనుమతించారు.. దీంతో మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్‌లు అయ్యాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి, గుంటూరు, విజయవాడల చుట్టూ ప్లాన్ చేశారు.. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో 190 కిలోమీటర్లు ఉంటుంది.

అమరావతి ORR కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ కావడంతో వాహనాలు ఎంటర్ (ప్రవేశించేందుకు) అయ్యేందుకు, ఎగ్జిట్ (బయటకు వచ్చేందుకు) అయ్యేందుకు అవకాశం ఉండదు. అందుకే 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు క్రాస్ చేసే దగ్గర ఇంటర్‌ఛేంజ్‌లు ప్రతిపాదించారు. కోల్‌కతా-చెన్నై నేషనల్ హైవే 16తో పాటుగా మచిలీపట్నం-విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రెండచోట్ల క్రాస్‌ చేసేలా ప్లాన్ చేశారు. ఇలా మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...