ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకున్నా బంగారం ధరల్లో ఊహించని మార్పు.. తనిష్క్, ఖజానా సహా ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ ఎంతంటే?

Date:

బంగారం ధరలు వరుసగా తగ్గి ఇవాళ స్వల్పంగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోయినా.. బంగారం ధరలు తగ్గకుండా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. డాలర్ విలువ పడిపోయింది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండగా.. బంగారంపైకి పెట్టుబడులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ధరలు తగ్గకుండా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. గత కొంత కాలంగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. అయితే ఇక్కడ బంగారం ధర ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్ డిమాండ్ తగ్గి.. బంగారం ధర పెరుగుతుంటుంది. అదే ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినా.. పెంచినా.. బంగారం ధర తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు దీనికి రివర్స్‌లో బంగారం ధర కిందటి రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక్కడ ప్రధాన కారణం.. డాలర్ విలువ తగ్గడం. అవును.. డాలర్ విలువ తగ్గితే.. ఆటోమేటిక్‌గా బంగారం ధర పెరుగుతుంటుంద.

దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ప్రస్తుతం ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు రూ. 200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,100 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 చొప్పున తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 220 పెరిగి తులం రూ. 1,50,660 కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కేజీకి రూ. 2.60 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో రూ. 5 వేల చొప్పున తగ్గింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...