
D Spiritaul: Nov 23: ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి పార్వతి రూ.50 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు విరాళం అందించిన పార్వతికి కృతజ్ఞతలు తెలిపారు.




