
D Spiritual: Nov 23: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం.. భారీ సాయం అందించిన హైదరాబాద్కు చెందిన పార్వతి!
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీమతి పార్వతి రూ.50 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను ఈవోకు అందజేశారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అందించిన ఈ భారీ విరాళం ద్వారా పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు మరింత సహకారం లభించనుంది.



