జిల్లాలో పెద్దపులి ఇంకా పట్టుబడకపోవడంతో అటవీశాఖ అధికారులు ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండటంతో ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.

ట్రాకర్ సాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అది సంచరిస్తున్న ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా ప్రజలకు ప్రమాదం తలెత్తకుండా సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో పూణేకు చెందిన నిపుణులతో పాటు అటవీశాఖ ప్రత్యేక సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు.

మరోవైపు పెద్దపులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. పులి పట్టుబడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *