ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కల్పలతా రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

మున్సిపల్‌ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు జరుగుతున్న అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు స్పందించడం లేదని వారు విమర్శించారు. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటిని తిరస్కరిస్తున్నారని, వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడంతో పాటు వారిపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *