ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ పదవులను దక్కించుకునేందుకు గ్రామాల్లో ఆశావహులు పోటీ పడుతున్నారు. సాధారణంగా ఐదేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికలపై గ్రామస్థాయిలో భారీ ఆసక్తి నెలకొంటుంది. అయితే పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో ఉన్న రామిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఈ గ్రామంలో ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చాలా కాలం తర్వాత మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం రామిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీపై అందరి దృష్టి పడింది. అసలు ఈ గ్రామంలో ఇన్నాళ్లూ ఎన్నికలు ఎందుకు జరగలేదు? ఈ పంచాయతీ ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు మరోసారి ఎన్నికలు నిర్వహించడానికి కారణాలేంటి? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. సర్పంచ్ పదవులను దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఐదేళ్లకోసారి జరుగుతుంటాయి. అయితే పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలంలో ఉన్న రామిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తోంది.

ఈ గ్రామంలో ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే సర్పంచ్ పదవికి పోటీతో కూడిన ఎన్నిక జరిగింది. మిగిలిన సందర్భాల్లో గ్రామస్థులంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు జరగనుండటంతో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

వామ్మో.. అన్నిసార్లు ఏకగ్రీవమే ఎలా?

ఒకప్పుడు రామిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో బుచ్చిపాపన్నపాలెం, కర్లకుంట అనే రెండు గ్రామాలు ఉండేవి. ఆ తర్వాత కర్లకుంట ప్రత్యేక గ్రామ పంచాయతీగా విడిపోయింది. దీంతో బుచ్చిపాపన్నపాలెం, రామిరెడ్డిపాలెం కలిసి ఒకే పంచాయతీగా కొనసాగాయి. అనంతరం 1978–79లో జరిగిన పునర్విభజనలో ఈ రెండు గ్రామాలు కూడా వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడ్డాయి.

అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 48 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతిసారీ గ్రామస్థులంతా ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు. దీంతో పోటీ లేకుండానే సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1979, 1986, 1995, 2001, 2006, 2021 సంవత్సరాల్లో ఇలా ఏకగ్రీవ ఎన్నికలు జరగడం రామిరెడ్డిపాలెం ప్రత్యేకతగా నిలిచింది.

అయితే 2013లో మాత్రం రామిరెడ్డిపాలెం పంచాయతీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ ఏడాదే గ్రామంలో తొలిసారిగా సర్పంచ్ పదవికి పోటీతో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కుమ్మెత్త కోటిరెడ్డి, రాజనాల ధనమ్మ సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ధనమ్మపై 72 ఓట్ల ఆధిక్యంతో కోటిరెడ్డి విజయం సాధించారు. దీంతో అప్పటివరకు కొనసాగిన ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి తొలిసారి బ్రేక్ పడింది.

13 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ.. కారణమేంటి?

రామిరెడ్డిపాలెంలో గతంలో పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినప్పటికీ, ఇప్పుడు మరోసారి పోటీ నెలకొనడానికి కారణమేంటన్న చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. ఈసారి గ్రామ సర్పంచ్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ (మహిళలు) కేటగిరీకి కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయినట్లు తెలుస్తోంది.

మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో గ్రామ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో ఇద్దరు మహిళా అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2013లో మహిళా అభ్యర్థి బరిలో నిలవడంతో ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్ పడగా, ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ కారణంగా అదే పరిస్థితి పునరావృతమవుతోందని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. దీంతో ఈసారి రామిరెడ్డిపాలెం పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *