గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్‌ పర్యవేక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Punetha) పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్‌ పర్యవేక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూడు దశల గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు (మంగళవారం) విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏడీజీపీ మధుసూదన్ రెడ్డి సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు.

19శాతం వరకూ ఏకగ్రీవాలు జరిగాయి..

ఆయా గ్రామపంచాయతీలు ఏకగ్రీవాలు అయ్యాయని అనిల్ చంద్రా పునేఠా తెలిపారు. ఆశించినంతగా ఏకగ్రీవాలు జరగలేదని చెప్పారు. 19శాతం వరకూ ఇవి జరిగాయని వెల్లడించారు. బలవంతంగా ఏకగ్రీవాలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కోసం పోలీసు బలగాలు అదనంగా విధుల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. డీజీపీ కార్యాలయం నుంచి సైతం బలగాలు విధుల్లో పాల్గొంటాయని అన్నారు. పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో ఒక అభ్యర్ధిని నాలుగుసార్లు పోటీ చేయకుండా కొంతమంది అడ్డుకున్నారని అన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను ఏపీ డీజీపీకి పంపించామని.. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారని అనిల్ చంద్రా పునేఠా పేర్కొన్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *