తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని కార్యకర్తే అధినేత కార్యకర్తే పార్టీకి బలం, బలగమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు సముచిత అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

పార్టీలో ప్రతి కార్యకర్త అభిప్రాయానికి విలువ ఉండాలని వారి కష్టానికి తగిన గుర్తింపు లభించాలని లోకేశ్ ఆకాంక్షించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పార్టీకి కార్యకర్తలకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం వారి సేవలకు గుర్తింపు ఇవ్వడం పార్టీతో వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతోనే ఈ యాప్‌ను ప్రారంభించినట్లు వివరించారు.

ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని వారి సహకారంతోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *