తిరుమల, తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్వామివారిని దర్శించుకోగా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

23 కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షణ

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల్లో సర్వదర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు

మంగళవారం 59,413 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 20,015 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా హుండీకి రూ.4.50 కోట్ల ఆదాయం సమకూరింది. అదే రోజు 3.18 లక్షల లడ్డూలను విక్రయించగా, 1.68 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు టీటీడీ వెల్లడించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *